అభ్యసనంలో క్రీడలు కీలకం : జహీర్‌ఖాన్‌

ABN , First Publish Date - 2022-10-17T09:47:10+05:30 IST

విద్యార్థుల నిరంతర అధ్యయన ప్రక్రియలో క్రీడలు ఎంతో కీలకమని టీమిండియా మాజీ పేసర్‌ జహీర్‌ఖాన్‌ అన్నాడు.

అభ్యసనంలో క్రీడలు కీలకం : జహీర్‌ఖాన్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): విద్యార్థుల నిరంతర అధ్యయన ప్రక్రియలో క్రీడలు ఎంతో కీలకమని టీమిండియా మాజీ పేసర్‌ జహీర్‌ఖాన్‌ అన్నాడు. క్రీడలు కేవలం వినోద సాధనంగానేకాకుండా..జీవిత ప్రయాణంలో అవసరమైన నైపుణ్యాల అభివృద్ధికి తోడ్పడతాయని పేర్కొన్నాడు. స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌ ఆధ్వర్యంలో ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన గాలా మీట్‌లో జహీర్‌ పాల్గొన్నాడు. కార్యక్రమంలో క్రీడల మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, శాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-17T09:47:10+05:30 IST