ఆసియా కప్‌కు శ్రీలంక ఆతిథ్యం.. ఐపీఎల్ ఫైనల్ తర్వాత చెబుతామన్న జైషా
ABN , First Publish Date - 2022-04-16T02:20:20+05:30 IST
ఆసియా కప్‌ను ఈ ఏడాది శ్రీలంక నిర్వహించాల్సి ఉండగా ప్రస్తుతం ఆ దేశంలోని పరిస్థితులు

ముంబై: ఆసియా కప్‌ను ఈ ఏడాది శ్రీలంక నిర్వహించాల్సి ఉండగా ప్రస్తుతం ఆ దేశంలోని పరిస్థితులు ఏమంత బాగాలేవు. ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న ఆ దేశంలో పరిస్థితులు రోజురోజుకు మరింతగా దిగజారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది శ్రీలంకలో జరగాల్సిన ఆసియాకప్‌పై సందిగ్ధత నెలకొంది. ఆగస్టు 27న ఆసియా కప్ ప్రారంభం కావాల్సి ఉండగా, ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న పరిస్థితులు టోర్నీ నిర్వహణకు ఏమాత్రం అనుకూలంగా లేవు.
శ్రీలంక తాజా పరిస్థితి నేపథ్యంలో స్పందించిన బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా మాట్లాడుతూ.. శ్రీలంకలోని పరిస్థితులు, క్రికెట్‌పై అది చూపించే ప్రభావం వంటి అంశాలపై శ్రీలంక అధికారులతో తాను చర్చించినట్టు చెప్పారు. శ్రీలంక బోర్డు ఆసియా కప్‌ను సురక్షితంగా, విజయంతంగా నిర్వహిస్తుందనే ఆశిస్తున్నట్టు చెప్పారు. మే 29న జరగనున్న ఐపీఎల్ ఫైనల్‌కు శ్రీలంక బోర్డు ప్రతినిధులు హాజరవుతారని, అనంతరం పరిస్థితిని అంచనా వేస్తామని చెప్పారు.