అదనపు పేసర్లుగా సిరాజ్‌, ఉమ్రాన్‌

ABN , First Publish Date - 2022-10-02T09:30:50+05:30 IST

టీ20 ప్రపంచక్‌పలో పాల్గొనేందుకు 15 మందితో కూడిన భారత జట్టును సెలెక్టర్లు ఇదివరకే ప్రకటించారు.

అదనపు పేసర్లుగా సిరాజ్‌, ఉమ్రాన్‌

టీ20 వరల్డ్‌కప్‌ కోసం ఆసీస్‌కు..

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు 15 మందితో కూడిన భారత జట్టును సెలెక్టర్లు ఇదివరకే ప్రకటించారు. వీరితో పాటు నలుగురు స్టాండ్‌బై ఆటగాళ్లు కూడా ఉన్నారు. కానీ బుమ్రా గాయంతో ఈ మెగా టోర్నీకి దూరమైనట్టేనని కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మరో ఇద్దరు అదనపు పేసర్లను కూడా ఆస్ట్రేలియాకు తీసుకెళ్లాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. వీరిలో మహ్మద్‌ సిరాజ్‌తో పాటు కశ్మీర్‌ సంచలన పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ ఉన్నారు. ఈనెల 6న ఇక్కడి నుంచి పెర్త్‌కు బయలుదేరే జట్టుతో పాటే వీరు కూడా వెళ్లనున్నారు. నెట్‌ బౌలర్లుగా ఈ ఇద్దరి సేవలను వినియోగించుకోనున్నారు.  

Read more