టైటిల్‌పై సింధు, సేన్‌ గురి

ABN , First Publish Date - 2022-06-07T10:13:58+05:30 IST

కామన్వెల్త్‌ గేమ్స్‌కు ముందు భారత ఏస్‌ షట్లర్లు పీవీ సింధు, లక్ష్య సేన్‌ టాప్‌ గేర్‌ను అందుకోవాలనుకుంటున్నారు.

టైటిల్‌పై సింధు, సేన్‌ గురి

జకార్తా: కామన్వెల్త్‌ గేమ్స్‌కు ముందు భారత ఏస్‌ షట్లర్లు పీవీ సింధు, లక్ష్య సేన్‌ టాప్‌ గేర్‌ను అందుకోవాలనుకుంటున్నారు. మంగళవారం నుంచి జరిగే ఇండోనేసియా ఓపెన్‌లో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో లైన్‌ క్రిస్టోఫర్సెన్‌ (డెన్మార్క్‌)తో సింధు తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్‌ లక్ష్యసేన్‌.. తొలి రౌండ్‌లో హన్స్‌ క్రిస్టియన్‌ను ఢీకొననున్నాడు. థామస్‌ కప్‌ హీరో కిడాంబి శ్రీకాంత్‌ ఈ టోర్నీకి దూరమ య్యాడు. డబుల్స్‌లో మను అత్రి-సుమీత్‌, అశ్విని-సిక్కిరెడ్డి, సిమ్రన్‌-రితిక, మిక్స్‌డ్‌లో ఇషాన్‌ భట్నాగర్‌-తనీష జంటలు బరిలోకి దిగనున్నాయి. 

Read more