వియత్నాం ఓపెన్‌ క్వార్టర్స్‌లో సిక్కి జోడీ

ABN , First Publish Date - 2022-09-30T09:24:34+05:30 IST

భారత డబుల్స్‌ స్టార్‌ సిక్కి రెడ్డి వియత్నాం ఓపెన్‌ సూపర్‌ 100 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో టైటిల్‌ దిశగా ముందంజ వేసింది.

వియత్నాం ఓపెన్‌ క్వార్టర్స్‌లో సిక్కి జోడీ

హో చి మిన్‌ సిటీ (వియత్నాం): భారత డబుల్స్‌ స్టార్‌ సిక్కి రెడ్డి వియత్నాం ఓపెన్‌ సూపర్‌ 100 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో టైటిల్‌ దిశగా ముందంజ వేసింది. ఈ తెలుగమ్మాయి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రీక్వార్టర్స్‌లో సిక్కి/రోహన్‌ కపూర్‌ జంట 21-10, 19-21, 21-18తో హాంకాంగ్‌ ద్వయం ఫాన్‌ కా యాన్‌/యెంగ్‌ షింగ్‌ చోపై గెలుపొందింది. ఇక పురుషుల సింగిల్స్‌ గతరౌండ్లో సాయి ప్రణీత్‌కు షాకిచ్చి సంచలనం సృష్టించిన రిత్విక్‌ సంజీవి సతీ్‌షకుమార్‌ మూడోరౌండ్లో ఓటమిపాలయ్యాడు. ఓంగ్‌ కెన్‌ యోన్‌ (మలేసియా) 19-21, 21-17, 21-19తో సతీ్‌షపై గెలిచాడు. 

Read more