షమి, హుడా అవుట్‌జట్టులో శ్రేయాస్‌, షాబాజ్‌

ABN , First Publish Date - 2022-09-27T09:41:21+05:30 IST

కొవిడ్‌తో బాధపడుతున్న పేసర్‌ మహ్మద్‌ షమితో పాటు గాయం కారణంగా ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడా సైతం దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీ్‌సకు దూరం కానున్నారు.

షమి, హుడా అవుట్‌జట్టులో  శ్రేయాస్‌, షాబాజ్‌

కొవిడ్‌తో బాధపడుతున్న పేసర్‌ మహ్మద్‌ షమితో పాటు గాయం కారణంగా ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడా సైతం దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీ్‌సకు దూరం కానున్నారు. ఆసీ్‌సతో సిరీ్‌సకు ముందు షమి కొవిడ్‌ బారిన పడిన విషయం తెలిసిందే. తనకు మరింత విశ్రాంతి అవసరమైనట్టు సమాచారం. ఇక వెన్నునొప్పితో బాధపడుతున్న  హుడా పునరావాస శిబిరం కోసం జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో చేరనున్నాడు. అతడి శ్రేయాస్‌ అయ్యర్‌, అలాగే హార్దిక్‌ స్థానంలో లెఫ్టామ్‌ స్పిన్నర్‌ షాబాజ్‌ అహ్మద్‌ జట్టులో చేరనున్నట్టు సమాచారం. ఇక షమి స్థానంలో ఆసీ్‌సతో సిరీ్‌సకు ఎంపికైన ఉమేశ్‌ యాదవ్‌ జట్టుతో పాటే కొనసాగనున్నాడు. సోమవారం టీమిండియా తిరువనంతపురం చేరింది.

Read more