భారత్‌కు మరో స్వర్ణం
ABN , First Publish Date - 2022-10-17T09:43:33+05:30 IST
ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్ లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. పురుషుల ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబుతా, కిరణ్ అంకుశ్ జాదవ్, రుద్రాంక్ష్ పాటిల్‌తో కూడిన జట్టు..
షూటింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్
కైరో: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్ లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. పురుషుల ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబుతా, కిరణ్ అంకుశ్ జాదవ్, రుద్రాంక్ష్ పాటిల్‌తో కూడిన జట్టు.. ఆదివారం జరిగిన స్వర్ణ పతక రౌండ్‌లో 16-10తో చైనాను ఓడించింది. మహిళల ఎయిర్ రైఫిల్‌లో మేఘన సజ్జనార్, ఎలవేనిల్ వలరివారిన్, మెహూలి ఘోష్‌ల బృందం 17-11తో జర్మనీపై గెలిచి కాంస్యం సాధించింది. మహిళల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో పాలక్, రిథమ్, యువికాతో కూడిన భారత జట్టు 6-16తో చైనా చేతిలో ఓడి రజతం సొంతం చేసుకొంది. 25 మీటర్ల మిక్స్‌డ్ టీమ్ జూనియర్ ఫైనల్లో మాన్వి-సమీర్ జంట 3-17తో చైనా చేతిలో ఓడి రజతం సాధించింది. మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ పసిడి పోరుకు దూసుకెళ్లింది.