రుబలేవ్‌కు షాక్‌

ABN , First Publish Date - 2022-01-23T08:35:23+05:30 IST

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆండ్రీ రుబలేవ్‌ మినహా.. సీడెడ్‌ ఆటగాళ్లందరూ ప్రీ క్వార్టర్స్‌కు చేరుకొన్నారు.

రుబలేవ్‌కు షాక్‌

ప్రీ క్వార్టర్స్‌కు మెద్వెదెవ్‌, సిలిచ్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆండ్రీ రుబలేవ్‌ మినహా.. సీడెడ్‌ ఆటగాళ్లందరూ ప్రీ క్వార్టర్స్‌కు చేరుకొన్నారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో 5వ సీడ్‌ రుబలేవ్‌ (రష్యా) 5-7, 6-7(3), 6-3, 3-6తో మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా) చేతిలో కంగుతి న్నాడు. రెండో సీడ్‌ మెద్వెదెవ్‌ 6-4, 6-4, 6-2తో వాన్‌ డి జెండ్స్‌షుల్స్‌పై, గ్రీకు వీరుడు సిట్సిపాస్‌ 6-3, 7-5, 6-7(2), 6-4తో బెనోయిట్‌పై, 9వ సీడ్‌ ఫెలిక్స్‌ అగర్‌ 6-4, 6-1, 6-1తో డాన్‌ ఇవాన్స్‌పై గెలిచారు. 

సబలెంక ముందుకు: మహిళల సింగిల్స్‌లో 2వ సీడ్‌ సబలెంక 4-6, 6-3, 6-1తో వాండర్సొవాపై, ఏడో సీడ్‌ స్వియటెక్‌ 6-2, 6-3తో కసట్‌కినాపై, హలెప్‌ 6-2, 6-1తో కొవినిచ్‌పై నెగ్గి ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించారు. పదో సీడ్‌ అనస్టాసియా పావ్‌ల్యుచెన్‌కొవా 3-6, 6-2, 2-6తో సొరానా క్రిస్టియా (రొమేనియా) చేతిలో పరాజయం పాలైంది. 

Read more