క్రెజికొవాకు షాక్‌..!

ABN , First Publish Date - 2022-05-24T09:42:56+05:30 IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పెను సంచలనం నమోదైంది. డిఫెండింగ్‌ చాంప్‌ బార్బరా క్రెజికొవాకు తొలి రౌండ్‌లోనే షాక్‌ తగిలింది.

క్రెజికొవాకు షాక్‌..!

నడాల్‌, స్వియటెక్‌ ముందుకు..

ఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పెను సంచలనం నమోదైంది. డిఫెండింగ్‌ చాంప్‌ బార్బరా క్రెజికొవాకు తొలి రౌండ్‌లోనే షాక్‌ తగిలింది. ఫ్రెంచ్‌ టీనేజర్‌ డయానె పారి ఆమెపై అద్భుత విజయం సాధించింది. జపాన్‌ స్టార్‌ నవోమి ఒసాక కూడా ఆరంభ రౌండ్‌లోనే ఓడి ఇంటిముఖం పట్టింది. జోరు మీదున్న వరల్డ్‌ నంబర్‌ వన్‌ ఇగా స్వియటెక్‌, ఐదో సీడ్‌ రఫెల్‌ నడాల్‌ అలవోక విజయాలతో ముందంజ వేశారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌ క్రెజికొవా (చెక్‌) 6-1, 2-6, 3-6తో పారి చేతిలో కంగుతింది. ఒసాక 7-5, 6-4తో 27వ సీడ్‌ అమందా అనిసిమొవా (అమెరికా) చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలైంది. కాగా, పోలెండ్‌ భామ స్వియటెక్‌ 6-2, 6-0తో లీసియా సురెంకో (ఉక్రెయిన్‌)పై, 15వ సీడ్‌ విక్టోరియా అజరెంకా (బెలారస్‌) 6-7(7), 7-6(1), 6-2తో అనా బోగ్డెన్‌ (రొమేనియా)పై, చెక్‌ ప్లేయర్‌ పెట్రా క్విటోవా 7-6(0), 6-1తో అన్నా బోండర్‌ (హంగేరి)పై, బియాంక అండ్రెస్క్యూ (కెనడా) 3-6, 7-5, 6-0 వైసలైన్‌ బోనవెంట్యూర్‌ (బెల్జియం)పై, డరియా సవిల్లే 6-1, 6-2తో వాలంటినీ (గ్రీస్‌)పై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. 


రఫా అలవోకగా..:

స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నడాల్‌ తొలి రౌండ్‌లో 6-2 6-2, 6-2తో జోర్డాన్‌ థాంప్సన్‌ (ఆస్ట్రేలియా)పై వరుస సెట్లలో నెగ్గాడు. 10వ సీడ్‌ కామెరూన్‌ నోరి (బ్రిటన్‌) 7-5, 6-2, 6-0తో మాన్యుయల్‌ గుయనార్డ్‌ (ఫ్రాన్స్‌)ను ఓడించాడు.

Updated Date - 2022-05-24T09:42:56+05:30 IST