సుందర్ స్థానంలో షాబాజ్
ABN , First Publish Date - 2022-08-17T10:09:28+05:30 IST
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా జింబాబ్వే పర్యటనకు దూరమయ్యాడు.

జింబాబ్వే టూర్‌కు ఎంపిక
న్యూఢిల్లీ: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా జింబాబ్వే పర్యటనకు దూరమయ్యాడు. గతవారం రాయల్ లండన్ వన్డే కప్ మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా సుందర్ ఎడమ భుజానికి గాయమవడంతో ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. దీంతో సుందర్ స్థానంలో ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ జట్టులోకొచ్చాడు.
బెంగాల్‌కు చెందిన 27 ఏళ్ల షాబాజ్ జింబాబ్వే సిరీ్‌సతో వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో బెంగళూరు తరఫున అద్భుత ప్రదర్శన చేసిన షాబాజ్.. 18 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో 41.64 సగటుతో 1041 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ ఉంది. 2.64 ఎకానమీతో 57 వికెట్లు పడగొట్టాడు. 2019-20 రంజీ సీజన్లో 500 రన్స్ చేయడంతో పాటు 35 వికెట్లు తీశాడు. గురువారం నుంచి జింబాబ్వేతో భారత్ 3 వన్డేల సిరీస్ ఆడనుంది.