మా క్లబ్‌లోకి స్వాగతం..

ABN , First Publish Date - 2022-09-17T09:56:51+05:30 IST

‘రిటైర్మెంట్‌ క్లబ్‌లోకి స్వాగతం’ అని స్విట్జర్లాండ్‌ దిగ్గజ ఆటగాడు రోజర్‌ ఫెడరర్‌ టెన్ని్‌సకు గుడ్‌బై చెప్పడంపై మరో దిగ్గజం సెరెనా విలియమ్స్‌ స్పందించింది.

మా క్లబ్‌లోకి స్వాగతం..

ఫెడరర్‌ రిటైర్మెంట్‌పై సెరెనా

న్యూయార్క్‌: ‘రిటైర్మెంట్‌ క్లబ్‌లోకి స్వాగతం’ అని స్విట్జర్లాండ్‌ దిగ్గజ ఆటగాడు రోజర్‌ ఫెడరర్‌ టెన్ని్‌సకు గుడ్‌బై చెప్పడంపై మరో దిగ్గజం సెరెనా విలియమ్స్‌ స్పందించింది. ఫెడెక్స్‌ అంటే తనకు ఎంతో గౌరవమని, అతడి ఆట తనను మంత్రముగ్దురాలిని చేసేదని పేర్కొంది. వచ్చేవారం లండన్‌లో జరిగే రాడ్‌ లెవర్‌ కప్‌ తర్వాత ప్రొఫెషనల్‌ టెన్ని్‌సకు తాను వీడ్కోలు పలుకుతున్నట్టు 20 గ్రాండ్‌స్లామ్‌ల చాంపియన్‌ ఫెడెక్స్‌ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు సెరెనా కూడా కొద్దిరోజుల కిందటే రిటైర్‌ అయిన విషయం విదితమే. ‘నిన్ను ఎప్పుడూ గమనిస్తూనే ఉన్నా. కెరీర్‌లో మనిద్దరి పయనం అచ్చంగా ఒకేలా సాగింది. నాతో సహా కోట్లాదిమందికి నువ్వు ప్రేరణగా నిలిచావు’ అని సెరెనా శుక్రవారం ట్వీట్‌ చేసింది. 

Read more