సీనియర్లు వేధించేవారు!

ABN , First Publish Date - 2022-07-05T09:57:44+05:30 IST

తాను కూడా ర్యాగింగ్‌ బాధితురాలిననే సంచలన విషయాన్ని భారత టాప్‌ స్ర్పింటర్‌ ద్యూతీ చంద్‌ బయటపెట్టింది.

సీనియర్లు వేధించేవారు!

భువనేశ్వర్‌: తాను కూడా ర్యాగింగ్‌ బాధితురాలిననే సంచలన విషయాన్ని భారత టాప్‌ స్ర్పింటర్‌ ద్యూతీ చంద్‌ బయటపెట్టింది. 2006-08లో భువనేశ్వర్‌లోని స్పోర్ట్స్‌ హాస్టల్‌లో తాను ఎంతో మానసిక వ్యథను అనుభవించానని తెలిపింది. తాజాగా ఒడిశాలోని ఓ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని ర్యాంగింగ్‌ కారణంగా ఆత్మహత్య చేసుకొంది. ఈ దుర్ఘటనపై ద్యూతీ స్పందించింది. ‘సీనియర్లు బాడీ మసాజ్‌ చేయాలని, దుస్తులు ఉతకాలని నన్ను వేధించేవార’ని చంద్‌ పేర్కొంది. తన పేదరికాన్ని కూడా అవహేళన చేసేవారని గుర్తు చేసుకొంది. దీంతో ఏమీ చేయలేక నిస్సహాయంగా తనలో తానే కుమిలిపోయే దాన్నని ద్యూతీ చెప్పింది. 

Read more