స్కూల్‌ క్రికెట్‌ బోర్డును ప్రారంభించిన వెంగ్‌సర్కార్‌

ABN , First Publish Date - 2022-09-13T09:05:54+05:30 IST

పాఠశాల స్థాయి నుంచే మెరికల్లాంటి క్రికెటర్లను గుర్తించి, వారిని సాన పెట్టేందుకు స్కూల్‌ క్రికెట్‌ బోర్డు (ఐఎ్‌సబీసీ) ఏర్పాటైంది.

స్కూల్‌ క్రికెట్‌ బోర్డును ప్రారంభించిన వెంగ్‌సర్కార్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): పాఠశాల స్థాయి నుంచే మెరికల్లాంటి క్రికెటర్లను గుర్తించి, వారిని సాన పెట్టేందుకు స్కూల్‌ క్రికెట్‌ బోర్డు (ఐఎ్‌సబీసీ) ఏర్పాటైంది. సోమవారం నగరంలోని ఒక హోటల్‌లో జరిగిన ఈ బోర్డు ప్రారంభోత్సవంలో దిగ్గజ క్రికెటర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వెంగ్‌సర్కార్‌ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో పాఠశాల విద్యార్థులందరికీ ఒక మంచి క్రికెట్‌ వేదికను తీసుకురావడం హర్షణీయమన్నాడు. ఈ బోర్డుకు సీఈఓగా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ కార్యదర్శి సునీల్‌ బాబు వ్యవహరించనుండగా, రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్‌ చీఫ్‌ ప్యాట్రన్‌గా నియమితులయ్యారు. 

Read more