క్వార్టర్స్‌కు సాత్విక్‌ జోడీ

ABN , First Publish Date - 2022-10-21T10:29:22+05:30 IST

డెన్మార్క్‌ ఓపెన్‌లో సాత్విక్‌ జోడీ, లక్ష్యసేన్‌ క్వార్టర్స్‌కు చేరుకోగా.. ఏస్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ ఇంటిముఖం పట్టాడు.

క్వార్టర్స్‌కు సాత్విక్‌ జోడీ

శ్రీకాంత్‌ అవుట్‌

డెన్మార్క్‌ ఓపెన్‌

ఒడెన్స్‌: డెన్మార్క్‌ ఓపెన్‌లో సాత్విక్‌ జోడీ, లక్ష్యసేన్‌ క్వార్టర్స్‌కు చేరుకోగా.. ఏస్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ ఇంటిముఖం పట్టాడు. పురుషుల డబుల్స్‌ రౌండ్‌-16లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి జంట 21-14, 21-16తో ఇండోనేసియాకు చెందిన మహ్మద్‌ షోహిబుల్‌ ఫిక్రి-మౌలానా బగా్‌సపై గెలిచింది. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి-ట్రీసా జోలీ జంట 21-23, 13-21తో థాయ్‌లాండ్‌కు చెందిన జంగోల్‌పన్‌ కిటితరాకుల్‌-ప్రజోంగ్‌జాయ్‌ చేతిలో ఓడింది. సింగిల్స్‌ ప్రీ క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌ 13-21, 15-21తో లో కి యు (సింగపూర్‌) చేతిలో, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 9-21, 18-21తో లక్ష్య సేన్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. 

Updated Date - 2022-10-21T10:29:22+05:30 IST