అలా అయితే సచిన్ లక్ష పరుగులు చేసేవాడు: షోయబ్ అక్తర్

ABN , First Publish Date - 2022-01-31T02:32:49+05:30 IST

క్రికెట్‌లో ఇప్పుడున్నన్ని నిబంధనలు అప్పుడు కనుక ఉండి ఉంటే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్

అలా అయితే సచిన్ లక్ష పరుగులు చేసేవాడు: షోయబ్ అక్తర్

న్యూఢిల్లీ: క్రికెట్‌లో ఇప్పుడున్నన్ని నిబంధనలు అప్పుడు కనుక ఉండి ఉంటే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఏకంగా లక్ష పరుగులు చేసి ఉండేవాడని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. తన యూట్యూబ్ చానల్ కోసం టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రితో కలిసి మాట్లాడుతూ అక్తర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్‌లో ప్రస్తుతం ఉన్న నిబంధనలన్నీ బ్యాటర్లకే అనుకూలించేలా ఉన్నాయని పేర్కొన్నాడు.

 

ప్రస్తుతం ఇన్నింగ్స్‌లో రెండు బంతులను ఉపయోగించడంతోపాటు మూడు రివ్యూలను అందుబాటులోకి తీసుకొచ్చారని అక్తర్ గుర్తు చేశాడు. ఒకవేళ సచిన్ ఆడే రోజుల్లో కనుక ఇవే నిబంధనలు ఉండి ఉంటే చాలా ఈజీగా లక్ష పరుగులు సాధించి ఉండేవాడన్నాడు.


సచిన్ తన కెరియర్ తొలినాళ్లలోనే దిగ్గజ బౌలర్లు అయిన వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, షేన్ వార్న్ వంటి వారిని ఎదుర్కోవాల్సి వచ్చిందన్నాడు. ఆ తర్వాత తనను, బ్రెట్ లీని ఎదుర్కొన్నాడని వివరించాడు. ఆ తర్వాతి తరం బౌలర్లను కూడా సచిన్ ఎదుర్కొన్నాడని అక్తర్ గుర్తు చేశాడు. కాగా, టెండూల్కర్ తన కెరియర్‌లో మొత్తంగా 34,357 పరుగులు చేశాడు.

Updated Date - 2022-01-31T02:32:49+05:30 IST