విండీస్‌తో సిరీస్‌కు రోహిత్‌ ఫిట్‌!

ABN , First Publish Date - 2022-01-18T10:13:53+05:30 IST

తొడ కండరాల గాయంతో బాధపడుతున్న భారత వన్డే జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వేగంగా కోలుకుంటున్నాడు.

విండీస్‌తో సిరీస్‌కు రోహిత్‌ ఫిట్‌!

న్యూఢిల్లీ: తొడ కండరాల గాయంతో బాధపడుతున్న భారత వన్డే జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వేగంగా కోలుకుంటున్నాడు. దీంతో వచ్చే నెలలో వెస్టిండీ్‌సతో జరిగే పరిమిత ఓవర్ల సిరీ్‌సలకు అతను సిద్ధంగా ఉండే అవకాశం ఉంది. నెట్‌ సెషన్‌లో గాయపడడంతో రోహిత్‌ దక్షిణాఫ్రికా టూర్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ‘ఎన్‌సీఏ పునరావాస శిబిరంలో ఉన్న రోహిత్‌ ఫిట్‌నెస్‌ ఆశాజనకంగా ఉంది. విండీ్‌సతో సిరీ్‌సకు మరో మూడు వారాల సమయం ఉంది. ఆ లోగా తను కోలుకునే అవకాశం ఉంది’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. విండీ్‌సతో ఫిబ్రవరి 6 నుంచి మూడు వన్డేలు.. 15 నుంచి మూడు టీ20లు జరుగుతాయి.

Updated Date - 2022-01-18T10:13:53+05:30 IST