రిచా 4 ర్యాంక్‌లు పైకి
ABN , First Publish Date - 2022-12-20T23:56:35+05:30 IST
ఆస్ట్రేలియాతో నాలుగో టీ20లో అదరగొట్టిన భారత కీపర్, బ్యాటర్ రిచా ఘోష్ (19 బంతుల్లో 40 నాటౌట్) తాజా ఐసీసీ పొట్టి ఫార్మాట్ ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపరుచుకుంది. మంగళవారం విడుదలైన
దుబాయ్: ఆస్ట్రేలియాతో నాలుగో టీ20లో అదరగొట్టిన భారత కీపర్, బ్యాటర్ రిచా ఘోష్ (19 బంతుల్లో 40 నాటౌట్) తాజా ఐసీసీ పొట్టి ఫార్మాట్ ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపరుచుకుంది. మంగళవారం విడుదలైన ర్యాంకింగ్స్‌లో..బ్యాటర్ల విభాగంలో నాలుగు స్థానాలు ఎగబాకిన రిచా 40వ ర్యాంక్‌లో నిలిచింది. ఆల్‌రౌండర్ దీప్తీశర్మ ఒక ర్యాంక్ మెరుగుపరుచుకొని 32వ స్థానం దక్కించుకుంది. స్మృతీ మంధాన (3), షఫాలీ వర్మ (6), జెమీమా రోడ్రిగ్స్ (9) టాప్-10లో నిలిచారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 14వ ర్యాంక్‌లో ఉంది.