కోహ్లీకి రెస్ట్‌.. అశ్విన్‌కు పిలుపు

ABN , First Publish Date - 2022-07-15T10:11:56+05:30 IST

వెస్టిండీ్‌సతో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌ కోసం భారత జట్టును ప్రకటించారు.

కోహ్లీకి రెస్ట్‌.. అశ్విన్‌కు పిలుపు

జట్టులోకి రాహుల్‌, కుల్దీప్‌ 

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు జట్టు

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌ కోసం భారత జట్టును ప్రకటించారు. ఈ నెల 29న ఆరంభమయ్యే ఈ సిరీ్‌సకు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ, పేసర్‌ బుమ్రా, స్పిన్నర్‌ చాహల్‌లకు విశ్రాంతినిచ్చారు. వెటరన్‌ స్పిన్నర్‌ ఆర్‌.అశ్విన్‌కు జట్టులో చోటు కల్పించారు. గతేడాది నవంబరులో అతను చివరి టీ20 ఆడడం గమనార్హం. రోహిత్‌ శర్మ ఆధ్వర్యంలో 18 మందితో కూడిన జట్టును జాతీయ సెలెక్టర్లు గురువారం ఎంపిక చేశారు. అలాగే ఐదు మ్యాచ్‌ల్లో చివరి రెండింటిని అమెరికాలో నిర్వహించనున్నారు.


ఆసియా కప్‌, టీ20 వరల్డ్‌క్‌పల కోసం ఈ సిరీస్‌ చివరి సన్నాహకం కానుంది. కరీబియన్‌ టూర్‌లో పరిమిత ఓవర్ల సిరీ్‌సల నుంచి తనను మినహాయించాలని కోహ్లీ కోరినట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే ఫామ్‌లో లేని కోహ్లీపై ఇది వేటా.. లేక రెస్టా అనేది చర్చనీయాంశమవుతోంది. గాయాల నుంచి కోలుకుంటున్న కేఎల్‌ రాహుల్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌లను జట్టులోకి తీసుకున్నారు. అయితే వీరు తమ ఫిట్‌నె్‌సను నిరూపించుకోవాల్సి ఉంటుంది. రవి బిష్ణోయ్‌, అవేశ్‌ ఖాన్‌ తమ స్థానాలను కాపాడుకున్నారు. ఈ సిరీస్‌కన్నా ముందు టీమిండియా ధవన్‌ కెప్టెన్సీలో మూడు వన్డేల సిరీ్‌సను ఈనెల 22 నుంచి విండీ్‌సతో ఆడనుంది. 


భారత టీ20 జట్టు:

రోహిత్‌ (కెప్టెన్‌), రాహుల్‌, ఇషాన్‌, సూర్యకుమార్‌, దీపక్‌ హుడా, శ్రేయాస్‌ అయ్యర్‌, దినేశ్‌ కార్తీక్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌, జడేజా, అక్షర్‌, అశ్విన్‌, బిష్ణోయ్‌, కుల్దీప్‌, భువనేశ్వర్‌, అవేశ్‌ ఖాన్‌, హర్షల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

Read more