MIvDC: DC ఓడిపోగానే ‘Ee Sala Cup Namde’ అన్న రేంజ్లో RCB సంబరాలు.. మీరే చూడండి..
ABN , First Publish Date - 2022-05-22T19:39:45+05:30 IST
ఐపీఎల్లో ఆసక్తికర సమయం రానే వచ్చింది. ఒక జట్టు ఓటమి మరో జట్టుకు కలిసిరావడం, ఒక జట్టు గెలుపు ఆశగా ప్లే-ఆఫ్ అవకాశం కోసం ఎదురుచూస్తున్న..

ముంబై: ఐపీఎల్లో ఆసక్తికర సమయం రానే వచ్చింది. ఒక జట్టు ఓటమి మరో జట్టుకు కలిసిరావడం, ఒక జట్టు గెలుపు ఆశగా ప్లే-ఆఫ్ అవకాశం కోసం ఎదురుచూస్తున్న మరో జట్టును ఇంటికి పంపడం వంటి ఉత్కంఠ పరిణామాల మధ్య ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఐపీఎల్ టైటిల్ ఒక్కసారైనా కొట్టాలని కసిగా ఉన్న RCB జట్టుకు శనివారం నాడు ఢిల్లీ జట్టుపై ముంబై విక్టరీ ఊపిరి పోసింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమి కారణంగా ప్లే-ఆఫ్‌కు వెళ్లిన నాలుగో జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అవకాశం దక్కింది. ఢిల్లీ 14 పాయింట్లతో సరిపెట్టుకుని ఈ సీజన్ నుంచి నిష్క్రమించింది. కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం నాడు లక్నో జట్టుతో జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు తలపడనుంది. ఆర్సీబీ జట్టు ప్లే-ఆఫ్స్‌కు చేరుకోవడంతో ఆ జట్టు ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు.
డుప్లెసిస్, విరాట్ కోహ్లీ ఢిల్లీపై ముంబై జట్టు విజయాన్ని పండగలా చేసుకున్నారు. ఇతర ఆటగాళ్లు కూడా గంతులేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోను జట్టు అధికారిక ట్విట్టర్ ఖాతాలో RCB పోస్ట్ చేసింది. ముంబైకి థ్యాంక్స్ చెబుతున్న అర్థం వచ్చేలా Handshake Emoji, తమ జట్టు ప్లే-ఆఫ్‌కు అర్హత సాధించి కోల్‌కత్తాలో తలపడబోతున్నట్టుగా Airplane Emojiను విరాట్ కోహ్లీ ట్వీట్ చేయడం విశేషం. RCB వరుసగా మూడో సంవత్సరం ప్లే-ఆఫ్స్‌కు అర్హత సాధించింది. Mumbai Indians vs Delhi Capitals మ్యాచ్‌ను బెంగళూరు జట్టు వీక్షిస్తున్న దృశ్యాలను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కొన్ని ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. ఈసారైనా RCB అభిమానుల కల నెరవేరుతుందో, Ee Sala Cup Namde అని ప్రతి సీజన్లో చెప్పే మాటను RCB జట్టు నిజం చేస్తుందో, లేదో చూడాలి.