రష్మీ గురి అదిరె..

ABN , First Publish Date - 2022-10-03T09:29:46+05:30 IST

జాతీయ క్రీడల్లో తెలంగాణ యువ షూటర్‌ రష్మీ రాథోడ్‌ స్కీట్‌ షూటింగ్‌లో రజతం సాధించింది.

రష్మీ గురి అదిరె..

జాతీయ క్రీడల షూటింగ్‌లో రజతం నెగ్గిన హైదరాబాదీ  

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ క్రీడల్లో తెలంగాణ యువ షూటర్‌ రష్మీ రాథోడ్‌ స్కీట్‌ షూటింగ్‌లో రజతం సాధించింది. ఈ హైదరాబాదీ షూటర్‌ 25 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, గణెమట్‌ సెఖోన్‌ (పంజాబ్‌) స్వర్ణం, శివానీ (మధ్యప్రదేశ్‌) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఈవెంట్‌లో తెలంగాణ జట్టు 3-2తో మహారాష్ట్రపై నెగ్గి ఫైనల్‌ చేరింది. మహిళల 3-3 బాస్కెట్‌బాల్‌ సెమీఫైనల్‌లో తెలంగాణ 21-14తో మహారాష్ట్రను ఓడించి ఫైనల్లో ప్రవేశించింది. ఇక, ఏపీ అమ్మాయిలు పల్లవి వెయిట్‌ లిఫ్టింగ్‌లో, కార్తీక ట్రిపుల్‌ జంప్‌లో రజత పతకాలు సాధించారు.

Read more