చిత్తుగా ఓడిన హైదరాబాద్‌

ABN , First Publish Date - 2022-12-31T02:39:44+05:30 IST

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది.

చిత్తుగా ఓడిన హైదరాబాద్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. శుక్రవారం ఉప్పల్‌ స్టేడియంలో ముగిసిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై అసోం 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఖరి రోజు 22 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ మరో మూడు పరుగులు మాత్రమే చేసి.. చివరి వికెట్‌ చేజార్చుకుంది. ఓవర్‌ నైట్‌ స్కోరు 228/9తో రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌ కొనసాగించిన హైదరాబాద్‌ 231 పరుగులకు ఆలౌటై ఓడింది. కెప్టెన్‌ తన్మయ్‌ (126 నాటౌట్‌) మినహా ఏడుగురు సింగిల్‌ డిజిట్‌కే పెవిలియన్‌ చేరారు.అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో అసోం 205కు, హైదరాబాద్‌ 208కు ఆలౌట్‌ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో అసోం 252 పరుగులకు ఆలౌటైంది.

Updated Date - 2022-12-31T02:39:44+05:30 IST

Read more