Singapore Open Badminton: సెమీస్‌కు చేరిన పీవీ సింధు
ABN , First Publish Date - 2022-07-16T02:22:43+05:30 IST
సింగపూర్ ఓపెన్ 2022లో భారత టాప్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) సెమీస్‌కు చేరింది. చైనాకు చెందిన హాన్

సింగపూర్: సింగపూర్ ఓపెన్ 2022లో భారత టాప్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) సెమీస్‌కు చేరింది. చైనాకు చెందిన హాన్ యూ(Han Yue) జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 17-21, 21-11, 21-19తో విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. తొలి గేమ్‌లో వెనకబడిన వెనకబడిన సింధు.. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ఆ తర్వాత వరుసగా రెండు సెట్లను చేజిక్కించుకుని ప్రత్యర్థిని మట్టికరిపించి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది.
సెమీస్‌లో సింధు జపాన్ షట్లర్, ప్రపంచ నంబర్ 38 ప్లేయర్ సేనా కవాకమి(Saena Kawakami)తో తలపడుతుంది. ఆరో సీడెడ్ క్రీడాకారిణి పోర్న్‌పావీ చోచువోంగ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో కవాకమి వరుస సెట్లలో విజయం సాధించింది.
మేలో థాయిలాండ్ ఓపెన్ తర్వాత పీవీ సింధుకు ఇదే తొలి సెమీస్ ఎంట్రీ కావడం గమనార్హం. మరోవైపు, సైనా నెహ్వాల్ (Saina Nehwal), హెచ్ఎస్ ప్రణయ్(HS Pronnoy) కూడా సింగపూర్ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు చేరుకున్నారు. జులై 28న బర్మింగ్‌హామ్‌లో ప్రారంభం కానున్న కామెన్వెల్త్ గేమ్స్‌కు ముందు సైనాకు ఇదే చివరి చివరి టోర్నీ కావడంతో టైటిల్ సాధించాలన్న పట్టుదలతో ఉంది.