పృథ్వీ షా అర్ధ శతకం.. దూసుకుపోతున్న ఢిల్లీ స్కోరు

ABN , First Publish Date - 2022-04-10T21:55:44+05:30 IST

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరుగుతున్న పోరులో ఢిల్లీ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌ ప్రారంభించిన

పృథ్వీ షా అర్ధ శతకం.. దూసుకుపోతున్న ఢిల్లీ స్కోరు

ముంబై: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరుగుతున్న పోరులో ఢిల్లీ జోరుగా ఆడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌ ప్రారంభించిన ఢిల్లీ తొలి ఓవర్ నుంచే దూకుడు మొదలుపెట్టింది. కోల్‌కతా అంటే చెలరేగిపోయే పృథ్వీషా మరోమారు రెచ్చిపోయాడు. 27 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత తొందపడి  వరుణ్ చక్రవర్తి బౌలింగులో బౌల్డయ్యాడు. దీంతో 93 పరుగుల వద్ద ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది.


మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా బ్యాట్‌ ఝళిపిస్తున్నాడు. 26 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 38 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతడికి అండగా కెప్టెన్ రిషభ్ పంత్ ఉన్నాడు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిశాయి. ఢిల్లీ వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. కాగా, పవర్ ప్లేలో ఢిల్లీ  వికెట్ నష్టపోకుండా 68 పరుగులు సాధించింది. ఐపీఎల్‌లో ఇది మూడో అత్యధికం. లక్నోపై సీఎస్‌కే 73/1, సీఎస్‌కేపై పంజాబ్ 72/2 స్కోరు చేసి తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

Read more