సంస్కృత క్రికెట్‌ కామెంటరీకి ప్రధాని ఫిదా

ABN , First Publish Date - 2022-10-05T09:40:54+05:30 IST

ఒకప్పుడు హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో మాత్రమే క్రికెట్‌ కామెంటరీ సాగేది. ఇటీవల తెలుగు, కన్నడ, తుళు తదితర ప్రాంతీయ భాషల్లోనూ కామెంటరీ చేస్తున్నారు.

సంస్కృత క్రికెట్‌  కామెంటరీకి ప్రధాని ఫిదా

బెంగళూరు బాయ్స్‌కు ప్రశంసలు 

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో మాత్రమే క్రికెట్‌  కామెంటరీ సాగేది. ఇటీవల తెలుగు, కన్నడ, తుళు తదితర ప్రాంతీయ భాషల్లోనూ కామెంటరీ చేస్తున్నారు. తొలిసారిగా బెంగళూరు నగరంలోని గిరినగర్‌ ప్రాంతంలో క్రికెట్‌ ఆడే పిల్లలు సంస్కృతంలో కామెంటరీ చేశారు. సదరు వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. సంస్కృత కామెంటరీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీక్షించారు. ఆ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. సంస్కృతంలో కామెంటరీ చెప్పిన పిల్లలను ప్రశంసించారు. 

Read more