పులులు 4వేలు.. కానీ ద్రవిడ్‌ ఒక్కడే!

ABN , First Publish Date - 2022-08-15T11:04:31+05:30 IST

తన ఆటోబయోగ్రఫీ ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’లో పలు సంచలన విషయాలను వెల్లడిస్తున్న న్యూజిలాండ్‌ మాజీ బ్యాటర్‌ రాస్‌ టేలర్‌.. టీమిండియా ప్రస్తుత కోచ్‌ రాహుల్‌

పులులు 4వేలు.. కానీ ద్రవిడ్‌ ఒక్కడే!

ఆటోబయోగ్రఫీలో రాస్‌ టేలర్‌ ప్రశంస


న్యూఢిల్లీ: తన ఆటోబయోగ్రఫీ ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’లో పలు సంచలన విషయాలను వెల్లడిస్తున్న న్యూజిలాండ్‌ మాజీ బ్యాటర్‌ రాస్‌ టేలర్‌.. టీమిండియా ప్రస్తుత కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కున్న క్రేజ్‌ను తెలిపే సంఘటనను ఒకదానిని ప్రస్తావించాడు. 2011లో రాస్‌టేలర్‌ ఐపీఎల్‌లో రాజస్థాన్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రోజులు. అప్పుడు ద్రవిడ్‌ కూడా అదే జట్టుకు ఆడుతున్నాడు. ఇద్దరూ కలిసి ఓరోజు రణ్‌ధంబోర్‌ నేషనల్‌ పార్క్‌కు పులిని చూసేందుకు వెళ్లారు. ‘ద్రవిడ్‌, నేను ఓపెన్‌ టాప్‌ ఎస్‌యూవీలో వెళ్లాం. మా వాహనానికి 100 మీ. దూరంలో పులి కనిపించింది. మేం దానివైపు చూస్తుండగా.. మా పక్కన ఇతర వాహనాల్లో ఉన్న వాళ్లంతా ద్రవిడ్‌వైపు చూస్తూ తమ కెమెరాలతో అతడి ఫొటోలు తీసేందుకు పోటీపడ్డారు. అప్పుడు తెలిసింది.. భారత్‌లో క్రికెటర్లకున్న క్రేజ్‌, మరీ ముఖ్యంగా ద్రవిడ్‌లాంటి ఆటగాళ్లకున్న స్టార్‌డమ్‌. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వేల పులులుంటాయేమో. కానీ రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రం ఒక్కడే’ అని రాస్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. 

Read more