నార్వే చెస్‌ ఓపెన్‌ విజేత ప్రజ్ఞానంద

ABN , First Publish Date - 2022-06-11T09:34:55+05:30 IST

ఇటీవల సూపర్‌ఫామ్‌తో దూసుకెళ్తున్న భారత చెస్‌ చిచ్చరపిడుగు రమేశ్‌బాబు ప్రజ్ఞానంద ఖాతాలో మరో అంతర్జాతీయ టైటిల్‌ చేరింది.

నార్వే చెస్‌ ఓపెన్‌ విజేత ప్రజ్ఞానంద

స్టావెంజర్‌ (నార్వే): ఇటీవల సూపర్‌ఫామ్‌తో దూసుకెళ్తున్న భారత చెస్‌ చిచ్చరపిడుగు రమేశ్‌బాబు ప్రజ్ఞానంద ఖాతాలో మరో అంతర్జాతీయ టైటిల్‌ చేరింది. ఈ యువ గ్రాండ్‌మాస్టర్‌ నార్వే చెస్‌ టోర్నమెంట్‌లో ఓపెన్‌ ఈవెంట్‌ విజేతగా నిలిచి అదరహో అనిపించాడు. శుక్రవారం జరిగిన చివరి, తొమ్మిదో రౌండ్లో ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ ప్రణీత్‌ను ఓడించిన ప్రజ్ఞానంద.. మొత్తం 9 పాయింట్లకు గాను 7.5 స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఇజ్రాయెల్‌ క్రీడాకారిణి మార్సెల్‌ ఎఫ్‌రోమిస్కీ, స్వీడన్‌ ఆటగాడు జంగ్‌ మిన్‌ సియో వరుసగా రెండు, మూడు స్థానాలతో పోడియం ఫినిష్‌ చేశారు. చెన్నైకి చెందిన 16 ఏళ్ల ప్రజ్ఞానంద గతనెలలో జరిగిన మాస్టర్స్‌ చెసబుల్‌ ఆన్‌లైన్‌ టోర్నమెంట్‌లో ప్రపంచ చాంపియన్‌, నెంబర్‌వన్‌ ఆటగాడు మాగ్నస్‌ కార్ల్‌సన్‌తో పాటు నెదర్లాండ్స్‌ స్టార్‌ అనీష్‌ గిరిలకు షాకిచ్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే

Read more