డోపింగ్ వ్యతిరేక బిల్లుకు ఆమోదం
ABN , First Publish Date - 2022-08-04T08:16:47+05:30 IST
జాతీయ డోపింగ్ వ్యతిరేక బిల్లుకు పార్లమెంట్‌లో మూజువాణి ఓటుతో ఆమోద ముద్ర పడింది. లోక్‌సభలో గతవారమే ఈ బిల్ పాస్ కాగా...
న్యూఢిల్లీ: జాతీయ డోపింగ్ వ్యతిరేక బిల్లుకు పార్లమెంట్‌లో మూజువాణి ఓటుతో ఆమోద ముద్ర పడింది. లోక్‌సభలో గతవారమే ఈ బిల్ పాస్ కాగా.. బుధవారం రాజ్యసభలోనూ బిల్‌కు ఆమోదం లభించింది. క్రీడా మంత్రిగా అనురాగ్ ఠాకూర్ ప్రవేశపెట్టిన మొదటి క్రీడా బిల్ ఇదే. ప్రస్తుతం దేశంలో ఏడాదికి 6 వేల డోప్ పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌లు మాత్రమే ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించాలంటే నెలకు 10 వేల డోప్ పరీక్షలు చేసే ల్యాబ్‌లు అవసరం. ఈ నేపథ్యంలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)ను బలోపేతం చేయడంతో పాటు దేశంలో ల్యాబ్‌ల సంఖ్య గణనీయంగా పెంచేందుకు ఈ కొత్త బిల్ ఉపయోగపడతుందని అనురాగ్ చెప్పారు.