3000 మీ. పరుగులో జాతీయ రికార్డు

ABN , First Publish Date - 2022-07-04T09:58:05+05:30 IST

మహిళల 3000 మీటర్ల పరుగులో పారుల్‌ చౌధురి జాతీయ రికార్డును నెలకొల్పింది.

3000 మీ. పరుగులో జాతీయ రికార్డు

లాస్‌ఏంజెల్స్‌: మహిళల 3000 మీటర్ల పరుగులో పారుల్‌ చౌధురి జాతీయ రికార్డును నెలకొల్పింది. లాస్‌ఏంజెల్స్‌లో యూఏ సన్‌సెట్‌ టూర్‌లో భాగంగా జరిగిన ఈ రేసులో పారుల్‌ 8 నిమిషాల 57 సెకన్లలో పరుగును ముగించి కాంస్యంతో మెరిసింది. దీంతో ఆరేళ్ల క్రితం నెలకొల్పిన 9 ని. 4 సెకన్లతో సూరియా లోగనాథన్‌ పేరిటనున్న జాతీయ రికార్డు బద్దలైంది. వచ్చే నెల అమెరికాలో జరగనున్న వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో పాల్గొననున్న భారత బృందంలో 27 ఏళ్ల పారుల్‌ కూడా ఉంది. 

Updated Date - 2022-07-04T09:58:05+05:30 IST