నాకౌట్‌ రౌండ్‌కు పంకజ్‌, లక్ష్మణ్‌

ABN , First Publish Date - 2022-10-02T09:32:33+05:30 IST

భారత ప్రముఖ క్యూయిస్ట్‌ పంకజ్‌ ఆడ్వాణీ, డిఫెండింగ్‌ చాంప్‌ లక్ష్మణ్‌ రావత్‌ వరల్డ్‌ 6-రెడ్‌ స్నూకర్‌ చాంపియన్‌షిప్ నాకౌట్‌ రౌండ్‌కు చేరుకున్నాడు.

నాకౌట్‌ రౌండ్‌కు పంకజ్‌, లక్ష్మణ్‌

కౌలాలంపూర్‌: భారత ప్రముఖ క్యూయిస్ట్‌ పంకజ్‌ ఆడ్వాణీ, డిఫెండింగ్‌ చాంప్‌ లక్ష్మణ్‌ రావత్‌ వరల్డ్‌ 6-రెడ్‌ స్నూకర్‌ చాంపియన్‌షిప్ నాకౌట్‌ రౌండ్‌కు చేరుకున్నాడు. శనివారం జరిగిన గ్రూప్‌-బి ఆఖరి మ్యాచ్‌లో ఆడ్వాణీ 4-2తో లో చెంగ్‌ లియాంగ్‌ (మలేసియా)పై గెలిచాడు. అంతకుముందు జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన పంకజ్‌ గ్రూప్‌ టాపర్‌గా నిలిచాడు. ఆదివారం జరిగే రౌండ్‌-32లో లిమ్‌ కోక్‌ లియాంగ్‌ (మలేసియా)తో ఆడ్వాణీ తలపడనున్నాడు. పంకజ్‌, రావత్‌తోపాటు కమల్‌ చావ్లా, శ్రీకృష్ణ, హరియా కూడా నాకౌట్‌ రౌండ్‌కు దూసుకెళ్లారు. 

Read more