పాక్‌-కివీస్‌ టెస్ట్‌ డ్రా

ABN , First Publish Date - 2022-12-31T02:36:30+05:30 IST

పాక్‌-న్యూజిలాండ్‌తో ముగిసిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. 77/2తో ఆఖరి రోజైన శుక్రవారం ఆట కొనసాగించిన పాక్‌ జట్టు 311/8 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను సాహసోపేతంగా డిక్లేర్‌ చేసింది.

పాక్‌-కివీస్‌ టెస్ట్‌ డ్రా

కరాచీ: పాక్‌-న్యూజిలాండ్‌తో ముగిసిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. 77/2తో ఆఖరి రోజైన శుక్రవారం ఆట కొనసాగించిన పాక్‌ జట్టు 311/8 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను సాహసోపేతంగా డిక్లేర్‌ చేసింది. ఇమాముల్‌ హక్‌ 96 పరుగులు చేయగా, ప్రత్యర్థి బౌలర్‌ ఇష్‌ సోఽథీ 6 వికెట్లు తీశాడు. ఈ దశలో మ్యాచ్‌ గెలవాలంటే కివీస్‌ 15 ఓవర్లలో 138 పరుగులు చేయాల్సి వచ్చింది. 7.3 ఓవర్లలో 61/1తో లక్ష్యం దిశగా దూసుకెళ్తున్న దశలో వెలుతురు లేమి కారణంగా మ్యాచ్‌ని నిలిపివేయడంతో కివీస్‌ ఉసూరుమంది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ 438 రన్స్‌ చేయగా, కివీస్‌ 612/9 వద్ద డిక్లేర్‌ చేసింది.

Updated Date - 2022-12-31T02:36:32+05:30 IST