ఎంసీజీ నా అడ్డా..

ABN , First Publish Date - 2022-09-30T09:23:08+05:30 IST

టీ20 ప్రపంచక్‌పలో తనను తేలిగ్గా తీసుకుంటే బ్యాటర్స్‌కు కష్టమేనని పాక్‌ పేసర్‌ హరీస్‌ రౌఫ్‌ చెబుతున్నాడు.

ఎంసీజీ నా అడ్డా..

పాక్‌ పేసర్‌ రౌఫ్‌

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచక్‌పలో తనను తేలిగ్గా తీసుకుంటే బ్యాటర్స్‌కు కష్టమేనని పాక్‌ పేసర్‌ హరీస్‌ రౌఫ్‌ చెబుతున్నాడు. ‘ఒకవేళ నా స్థాయికి తగ్గ బౌలింగ్‌ చేస్తే బ్యాటర్స్‌ నన్నంత సులువుగా ఎదుర్కోలేరు. ఇక రాబోయే టీ20 ప్రపంచక్‌పలో తొలి మ్యాచ్‌ మెల్‌బోర్న్‌లో జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. అది నా సొంత మైదానంలాంటిది. ఎందుకంటే బిగ్‌బా్‌షలో నేను మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు ఆడతా. ఇప్పటికే భారత జట్టుకు ఎలా బౌలింగ్‌ చేయాలనే విషయంలో కచ్చితమైన ప్రణాళికతో ఉన్నా’ అని రౌఫ్‌ తెలిపాడు. ప్రపంచకప్‌లో భారత్‌ తన తొలి మ్యాచ్‌ను పాక్‌తో ఆడనుంది.

Read more