t20 world cup: పాక్‌కు దెబ్బమీద దెబ్బ.. జింబాబ్వే చేతిలో ఓటమి
ABN , First Publish Date - 2022-10-27T20:53:15+05:30 IST
టీ20 వరల్డ్ కప్‌లో (t20 world cup2022) పాకిస్తాన్‌కు (Pakistan) దెబ్బమీద దెబ్బ తగిలింది. తొలి మ్యాచ్‌లో భారత్ (India) చేతిలో ఓటమి పాలైన పాక్.. జింబాబ్వేపై రెండవ మ్యాచ్‌లోనూ చావుదెబ్బతిన్నది.
పెర్త్: టీ20 వరల్డ్ కప్‌లో (t20 world cup2022) పాకిస్తాన్‌కు (Pakistan) దెబ్బమీద దెబ్బ తగిలింది. తొలి మ్యాచ్‌లో భారత్ (India) చేతిలో ఓటమి పాలైన పాక్.. జింబాబ్వేపై రెండవ మ్యాచ్‌లోనూ చావుదెబ్బతిన్నది. ఉత్కంఠ భరిత పోరులో 1 పరుగు తేడాతో ఘోర ఓటమిపాలైంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన జింబాబ్వే ఆటగాళ్లు పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చారు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. అయితే లక్ష్య చేధనలో పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో ఒకే ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే ఘనవిజయం సాధించింది. జింబాబ్వే విజయంతో కీలకపాత్ర పోషించిన సికందర్ రాజాకి (Sikandar Raza) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో పాకిస్తాన్ తన ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. దీంతో గ్రూప్-2 పాయింట్ల పట్టికలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ రోజు నెదర్లాండ్‌పై విజయంతో ఇండియా మొదటి స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే రెండు, మూడవ స్థానాల్లో ఉన్నాయి.
స్కోర్ బోర్డ్..
జింబాబ్వే బ్యాటింగ్: మధెవెరె (17), ఇర్వినె(19), మిల్టొన్ షుంబా(8), సీన్ విలియమ్స్ (31), సికందర్ రాజా(9), ఛకబ్వా(0), రయన్ బర్ల్(10 నాటౌట్), జోంగ్వే(0), బ్రాడ్ ఇవాన్స్(19), గరవా(3 నాటౌట్.) ఇక పాకిస్తాన్ బౌలర్లలో మహ్మద్ వసీం జూనియర్ 4 వికెట్లు, షదాబ్ ఖాన్ 3 వికెట్లు తీయగా హారిస్ రౌవుఫ్ 1 వికెట్ తీశాడు.
పాకిస్తాన్ బ్యాటింగ్: మహ్మద్ రిజ్వాన్ (14), బాబర్ ఆజం(4), షాన్ మసూద్(44), ఇఫ్తికర్ అహ్మద్ (5), షదాబ్ ఖాన్ (17), హైదర్ అలీ(0), మహ్మద్ నవాజ్ (22), మహ్మద్ వసీం జూనియర్(12 నాటౌట్), షాషీన్ అఫ్రీది (1) చొప్పున పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో అత్యధికంగా సికందర్ రాజా 3 వికెట్లు తీశాడు. ముజరబనిచ ల్యూక్ జోంగ్వే చెరో వికెట్ తీయగా బ్రాడ్ ఇవాన్స్ 2 వికెట్లు తీశాడు.