నీమన్‌ మోసగాడు!

ABN , First Publish Date - 2022-09-28T09:43:23+05:30 IST

గతవారం ముగిసిన జూలియన్‌ బేర్‌ జనరేషన్‌ కప్‌ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నీలో అమెరికా గ్రాండ్‌ మాస్టర్‌ హాన్స్‌ నీమన్‌తో మ్యాచ్‌ మధ్యలోనే తప్పుకోవడంపై ప్రపంచ..

నీమన్‌ మోసగాడు!

అతడితో ఆడలేనన్న కార్ల్‌సన్‌ 

న్యూఢిల్లీ: గతవారం ముగిసిన జూలియన్‌ బేర్‌ జనరేషన్‌ కప్‌ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నీలో అమెరికా గ్రాండ్‌ మాస్టర్‌ హాన్స్‌ నీమన్‌తో మ్యాచ్‌ మధ్యలోనే తప్పుకోవడంపై ప్రపంచ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ వివరణ ఇచ్చాడు. ‘అతడు మోసానికి పాల్పడుతున్నాడు. ఇది అనేకసార్లు జరిగింది. నీమన్‌తోనే కాదు అడ్డదారుల్లో గెలవాలనుకునే ఎవరితోనూ ఆడను’ అని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో కార్ల్‌సన్‌ తెలిపాడు. ఆ మధ్య సింక్విఫీల్డ్‌ కప్‌ ఈవెంట్‌లో కూడా నీమన్‌ చేతిలో ఓడిన మాగ్నస్‌ హఠాత్తుగా ఆ టోర్నీ నుంచి తప్పుకొన్నాడు. కాగా, 12, 16 ఏళ్ల వయసులో రెండుసార్లు మోసానికి పాల్పడట్టు నీమన్‌ ఇటీవల చెస్‌.కామ్‌ వెబ్‌సైట్‌కిచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించాడు. కానీ, ప్రత్యక్షంగా తలపడినప్పుడు ఎలాంటి తప్పూ చేయలేదన్నాడు.

Read more