కరోనా సోకినా.. ఆడొచ్చు!

ABN , First Publish Date - 2022-10-17T09:46:13+05:30 IST

టీ20 వరల్డ్‌కప్ లో కరోనా ఆంక్షలను పూర్తిగా ఎత్తివేశారు. అసలు కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు.

కరోనా సోకినా.. ఆడొచ్చు!

టీ20 వరల్డ్‌కప్ లో ఆంక్షల ఎత్తివేత

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌కప్ లో కరోనా ఆంక్షలను పూర్తిగా ఎత్తివేశారు. అసలు కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ ఎవరైనా క్రికెటర్‌కు కరోనా సోకినా.. అతడు ఆరోగ్యంగా ఉంటే వైద్యుల సూచన మేరకు మ్యాచ్‌ ఆడేందుకు ఎటువంటి అభ్యంతరాలు కూడా లేవు. కానీ, ఆ ఆటగాడు మాస్క్‌ ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలి. కాగా, ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్‌లో కొవిడ్‌ ప్రొటోకాల్‌కు సంబంధించి ఐసీసీ, ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎక్కడా ఒక్క ప్రకటన కూడా చేయలేదు. అయితే, ఈ ఏడాది ఆరంభంలో సెర్బియా టెన్నిస్‌ ప్లేయర్‌ నొవాక్‌ జొకోవిచ్‌.. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోనందుకు అతడిని ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడకుండా వెనక్కిపంపించారు. అలాంటి దేశంలో ఇప్పుడు కొవిడ్‌ ఆంక్షలను గాలికి వదిలేశారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

Updated Date - 2022-10-17T09:46:13+05:30 IST