మహిళా అథ్లెట్ల కొత్త చరిత్ర
ABN , First Publish Date - 2022-03-05T09:39:45+05:30 IST
ప్రపంచ రేస్ వాకింగ్ చాంపియన్‌షి్‌పలో భారత మహిళల జట్టుకు తొలి పతకం దక్కింది.
ప్రపంచ రేస్ వాకింగ్‌లో భారత్‌కు తొలి పతకం
మస్కట్: ప్రపంచ రేస్ వాకింగ్ చాంపియన్‌షి్‌పలో భారత మహిళల జట్టుకు తొలి పతకం దక్కింది. భావనా జాట్, రవీనా, మునితా ప్రజాపతితో కూడిన భారత త్రయం ఈ మెగా ఈవెంట్‌లో కాంస్య పతకం కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన రేస్ వాకింగ్‌లో 20 కిలో మీటర్ల ఈవెంట్‌లో రవీనా 14వ, భావన 21వ, మునిత 26వ స్థానాల్లో నిలిచారు. ఓవరాల్‌గా ఈ ముగ్గురు అథ్లెట్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత భారత జట్టుకు కాంస్య పతకాన్ని ఖరారు చేశారు. చైనాకు స్వర్ణం, గ్రీస్ జట్టుకు రజతం లభించాయి.