బిడ్డను కనాలన్నాడు..: నీనా గుప్తా

ABN , First Publish Date - 2022-11-24T01:18:21+05:30 IST

తాను గర్భవతినని చెబితే..బిడ్డకు జన్మనివ్వాలని అలనాటి వెస్టిండీస్‌ స్టార్‌ వివియన్‌ రిచర్డ్స్‌ సూచించాడని నటి నీనా

బిడ్డను కనాలన్నాడు..: నీనా గుప్తా

ముంబై: తాను గర్భవతినని చెబితే..బిడ్డకు జన్మనివ్వాలని అలనాటి వెస్టిండీస్‌ స్టార్‌ వివియన్‌ రిచర్డ్స్‌ సూచించాడని నటి నీనా గుప్తా వెల్లడించింది. వివాహితుడైన విండీస్‌ మాజీ కెప్టెన్‌ రిచర్డ్స్‌..నీనాతో రిలేషన్‌ కొనసాగించిన సంగతి తెలిసిందే. ఫలితంగా గుప్తా గర్భం దాల్చగా, ఆవిషయాన్ని ఆమె రిచర్డ్స్‌కు తెలియజేస్తూ ‘నీకిష్టం లేకపోతే బిడ్డకు జన్మనివ్వను’ అని చెప్పిందట. అందుకు రిచర్డ్స్‌ ‘నీ మీద ప్రేమ ఉంది. బిడ్డను కను’ అని బదులిచ్చాడని నీనా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. కాగా నీనా-వివ్‌ల కుమార్తె మసాబా గుప్తా (33 ఏళ్లు) ఫ్యాషన్‌ డిజైనర్‌, నటి కూడా.

Updated Date - 2022-11-24T01:18:21+05:30 IST

Read more