నడాల్‌కు గోల్డెన్‌ చాన్స్‌

ABN , First Publish Date - 2022-01-28T09:16:13+05:30 IST

ఆధునిక టెన్నిస్‌ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన ఆటగాడిగా తనపేరును సువర్ణాక్షరాలతో లిఖించుకునేందుకు..

నడాల్‌కు గోల్డెన్‌ చాన్స్‌

మెల్‌బోర్న్‌: ఆధునిక టెన్నిస్‌ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన ఆటగాడిగా తనపేరును సువర్ణాక్షరాలతో లిఖించుకునేందుకు స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నడాల్‌ అతి చేరువలో ఉన్నాడు.  రఫా.. మరో రెండు మ్యాచ్‌లు నెగ్గితే అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు (21) నెగ్గిన తొలి ఆటగాడిగా రికార్డు అందుకొంటాడు. శుక్రవారం జరిగే సెమీ్‌సలో ఏడో సీడ్‌ మాటో బెరెట్టినితో ఆరో సీడ్‌ నడాల్‌ తలపడనున్నాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సెమీస్‌ చేరిన తొలి ఇటలీ ఆటగాడిగా నిలిచిన బెరెట్టిని నుంచి నడాల్‌కు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

 

 కాగా, 2021 సెమీస్‌లో తలపడిన యువ ఆటగాళ్లు డేనిల్‌ మెద్వెదెవ్‌, గ్రీకు వీరుడు స్టెఫనోస్‌ సిట్సిపాస్‌ మరోసారి ఢీకొననున్నారు. 2021 యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ అయిన రెండో సీడ్‌ మెద్వెదెవ్‌ వరుసగా మరో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై కన్నేశాడు.

Updated Date - 2022-01-28T09:16:13+05:30 IST