రేపటి మ్యాచ్‌లో Sunrisers Hyderabd గెలవకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా..

ABN , First Publish Date - 2022-05-17T01:22:57+05:30 IST

IPl 2022 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్ రేసులో ఢీ అంటే ఢీ అనేలా జట్లు తలపడుతున్నాయి. వరుసగా 5 ఓటములతో ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకున్న

రేపటి మ్యాచ్‌లో Sunrisers Hyderabd గెలవకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా..

ముంబై : IPl 2022 సీజన్ ముగింపు దశకు చేరువవుతోంది. ప్లే ఆఫ్ రేసులో ఢీ అంటే ఢీ అనేలా జట్లు తలపడుతున్నాయి. అయితే వరుసగా 5 ఓటములతో ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకున్న Sunrisers Hyderabd తదుపరి మ్యాచ్‌లో గెలవకపోతే ఏం జరుగుతుందో ఓ లుక్కేద్దాం..


తొలి 2 మ్యాచుల్లో ఓటమి.. ఆ తర్వాత వరుసగా 5 మ్యాచుల్లో విజయాలు.. ఆ తర్వాతి 5 మ్యాచుల్లో వరుస ఓటములు.. ఇదీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కథ. 5 విజయాలు లేదా 10 పాయింట్లతో ప్లే ఆఫ్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉంచుకున్న ఈ జట్టు తదుపరి మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌పై రేపు(మంగళవారం) ఆడబోతోంది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఇప్పటికే వైదొలగిన ముంబై ఇండియన్స్‌పై జరిగే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. లేదంటే ఇంటికి పోవాల్సిందే. ఎందుకంటే 6 విజయాలు లేదా 12 పాయింట్లతో 7 జట్లు ప్లే ఆఫ్ రేసులో ఉన్నాయి. టాప్ నుంచి 4వ స్థానంలో ఉన్న బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఖాతాలో కూడా 7 విజయాలు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ ఖాతాలో కేవలం 5 విజయాలు లేదా 10 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా 2 మ్యాచ్‌లు మాత్రమే మిలిగివున్నాయి. ఈ రెండూ గెలిస్తే 14 పాయింట్లు అవుతాయి. కానీ ఇతర జట్ల గెలుపోటములు, నెట్ రన్‌రేటు అంశాలు ప్లే ఆఫ్ బెర్త్‌ను డిసైడ్ చేస్తాయి.


ఇప్పుడైనా అద్భుతం జరిగితేనా.. 

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు టెక్నికల్‌గా ప్లే ఆఫ్ అవకాశాలు ఉన్నప్పటికీ అవి చాలా సంక్లిష్టంగా ఉన్నాయి. ఎందుకంటే పాయింట్స్ టేబుల్‌లో నాలుగవ స్థానంలో ఉన్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ప్రస్తుతం 7 విజయాలతో 14 పాయింట్లను కలిగివుంది. ఆర్‌సీబీకి మరో మ్యాచ్ కూడా మిగిలివుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిస్తే ప్లే ఆఫ్ రేసు సమీకరణం 16 పాయింట్లుగా మారుతుంది. ఈ సందర్భంలో హైదరాబాద్ ఆశలకు తెరపడినట్టే. మిగిలిన 2 మ్యాచ్‌ల్లో గెలిచినా హైదరాబాద్ ఖాతాలో 14 పాయింట్లు మాత్రమే ఉంటాయి.


ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్‌కు మెరుగైన అవకాశాలు..

ప్లే ఆఫ్ రేసులో సన్‌రైజర్స్ హైదరాబాద్ కంటే ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్‌కు మెరుగైన అవకాశాలున్నాయి. ఈ రెండు జట్లకు 2 చొప్పున మ్యాచ్‌లు కూడా మిగిలివున్నాయి. ఇప్పటికే 6 విజయాలు లేదా 12 పాయింట్లతో సన్‌రైజర్స్ కంటే మెరుగ్గా కనిపిస్తున్నాయి. 8 విజయాలు సాధించే అవకాశం ఈ రెండు జట్లకు ఉంది.

ఒకవేళ అదృష్టం కలిసొచ్చి.. అన్ని సమీకరణాలు కుదిరి 14 పాయింట్లతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్‌ నాలుగవ స్థానానికి పోటీపడినా నెట్ రన్ రేటు చాలా చాలా కీలకమవుతుంది. ఎందుకంటే.. 7 మ్యాచ్‌లు గెలిచే అవకాశం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తోపాటు కలకత్తా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఉంది. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఇప్పటికే 7 విజయాలతో ఉంది. అంటే 14 పాయింట్లతో నాలుగవ స్థానాన్ని నిర్ణయించాలంటే దాదాపు 4 టీంలు పోటీపడే అవకాశం ఏర్పడుతుంది. మరోవైపు 10 విజయాలతో గుజరాత్ టైటాన్స్ అధికారికంగా ప్లే ఆఫ్‌కు చేరింది. 8 విజయాలతో ఉన్న రాజస్థాన్ రాయల్స్, లక్నో సూజర్ జెయింట్స్ దాదాపు ప్లే ఆఫ్ రేసులో పటిష్ట స్థితిలో ఉన్నాయి. ఈ రెండు జట్లకు మరో మ్యాచ్ చొప్పున మిగిలివుంది.

Updated Date - 2022-05-17T01:22:57+05:30 IST