భారీ ఆధిక్యం దిశగా ముంబై

ABN , First Publish Date - 2022-12-15T02:48:54+05:30 IST

అర్మాన్‌ జాఫర్‌ అజేయ శతకం (116)తో రాణించడంతో ఇక్కడ ఆంధ్ర జట్టుతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ముంబై భారీ

భారీ ఆధిక్యం దిశగా ముంబై

విజయనగరం (ఆంధ్రజ్యోతి): అర్మాన్‌ జాఫర్‌ అజేయ శతకం (116)తో రాణించడంతో ఇక్కడ ఆంధ్ర జట్టుతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ముంబై భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. రెండో రోజైన బుధవారం ఓవర్‌నైట్‌ స్కోరు 25/1తో బ్యాటింగ్‌ కొనసాగించిన ముంబై ఆట ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. పేసర్‌ కేవీ శశికాంత్‌ (3/50), షోయబ్‌ (2/70) రాణించారు. ప్రస్తుతం ముంబై 52 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 238 పరుగులకు ఆలౌటైంది. ఇక, మరో మ్యాచ్‌లో హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 395 పరుగులకు ఆలౌట్‌ కాగా, తమిళనాడు రెండో రోజు ఆట చివరికి తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 203 పరుగులు చేసింది.

Updated Date - 2022-12-15T02:48:55+05:30 IST