ప్రధాని ప్రశంసలకు గర్వంగా ఉంది

ABN , First Publish Date - 2022-07-03T09:37:42+05:30 IST

ప్రధాని మోదీ తనను ప్రశంసించడం పట్ల టీమిండియా మాజీ కెప్టెన్‌ మిథాలీరాజ్‌ ఉబ్బితబ్బిబవుతోంది.

ప్రధాని ప్రశంసలకు  గర్వంగా ఉంది

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ తనను ప్రశంసించడం పట్ల టీమిండియా మాజీ కెప్టెన్‌ మిథాలీరాజ్‌ ఉబ్బితబ్బిబవుతోంది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మిథాలీని ‘భారత క్రికెట్‌కు రెండు దశాబ్దాలు సేవ చేశావు. ఎంతో ప్రతిభ ఉంటే తప్ప ఇది సాధ్యంకాదు. నీ ప్రతిభా సామర్థ్యాలు ఔత్సాహిక క్రీడాకారులకు స్ఫూర్తినిస్తాయి’ అని ప్రధాని కొనియాడారు. దీనికి రాజ్‌ స్పందిస్తూ ‘నాతోపాటు లక్షలాది మందికి మార్గదర్శకంగా నిలిచే ప్రధానినుంచి ఆ ప్రశంసలు అందుకోవడం గర్వంగా ఉంది. అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. భవిష్యత్‌లో దేశ క్రీడాభివృద్ధికి నేను మరింత శ్రమించేలా ఆ వ్యాఖ్యలు స్ఫూర్తినిస్తాయి’ అని ట్వీట్‌ చేసింది.  

Updated Date - 2022-07-03T09:37:42+05:30 IST