KL Rahul: కేఎల్ రాహుల్‌తో మెన్ ఆఫ్ ప్లాటినమ్ భాగస్వామ్యం

ABN , First Publish Date - 2022-10-07T02:17:42+05:30 IST

క్రికెట్ పిచ్ కూడా ఎంతోమందిని పరీక్షిస్తుంది. ప్రతి గేమ్‌లోనూ వారు కఠిన పరీక్షలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ వెరక ముందుకు వెళ్తారు. అలాంటి వారిలో ఒకరు టీమిండియా బ్యాటర్

KL Rahul: కేఎల్ రాహుల్‌తో మెన్ ఆఫ్ ప్లాటినమ్ భాగస్వామ్యం

న్యూఢిల్లీ: కొందరు పురుషులు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. సవాళ్లు ఎదురైనప్పుడు అసామాన్య ధైర్య సాహసాలు ప్రదర్శించి మెప్పిస్తారు. వీరు విలువలకు కట్టడి ఉండే ధీరోదాత్తులు. వీరు అనుసరించే విధానంతో తమ చుట్టూ ఉన్న వారిలో సైతం స్పూర్తి కలిగిస్తారు. క్రికెట్ పిచ్ కూడా ఎంతోమందిని పరీక్షిస్తుంది. ప్రతి గేమ్‌లోనూ వారు కఠిన పరీక్షలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ వెరక ముందుకు వెళ్తారు. అలాంటి వారిలో ఒకరు టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul).


క్రికెట్ సీజన్ ప్రారంభమవుతున్న వేళ ‘ప్లాటినమ్‌ గిల్డ్‌ ఇండియా’(Platinum Guild India)కు చెందిన ‘మెన్‌ ఆఫ్‌ ప్లాటినమ్‌’ (Men of Platinum) తాజాగా కేఎల్ రాహుల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తమ నూతన ప్రచారం ‘క్యారెక్టర్ ఇన్‌స్పైర్ ఆల్’ను ప్రారంభించింది. ప్రతికూల పరిస్థితుల్లో సైతం ధైర్యంగా ముందుకు సాగి విజయం సాధించిన అరుదైన పురుషులకు నివాళిగా ఇది  ఉంటుంది. ఈ యాడ్ పిక్చర్‌లో పలు చిత్రాలు కేఎల్‌ రాహుల్‌కు సంబంధించిన గ్రౌండ్‌ లోపటి, బయటి చిత్రాలను ప్రదర్శిస్తారు. 


 ఈ ప్రచార చిత్రంలో కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) కథానాయకుడిగా ఉంటాడు. ఈ చిత్రంలో తమ చుట్టూ ఉన్న వారికి స్ఫూర్తిని కలిగించేలా తమ చర్యలు ద్వారా మనలోని అసలైన లక్షణం వెల్లడించవచ్చని ఈ చిత్రంలో చెబుతారు. అదే సమయంలో అత్యంత అరుదైన ప్లాటినంను నిర్వచించే అసాధారణ లక్షణాలనూ ఇందులో పేర్కొన్నారు. బలం, స్థిరత్వం, స్వచ్ఛత, ధృడత్వానికి ప్రతీకగా నిలిచే ప్లాటినమ్‌  పురుషులకు కచ్చితమైన ఎంపికగానూ నిలుస్తుంది.


ఈ ప్రచారంపై రాహుల్ (KL Rahul) మాట్లాడుతూ.. మెన్‌ ఆఫ్‌ ప్లాటినం తాజా ప్రచారంలో భాగమైనందుకు సంతోషంగా ఉన్నట్టు చెప్పాడు. మన స్వభావమే ఇతరులకు స్ఫూర్తిగా  నిలిచేందుకు తోడ్పడుతుందని తాను నమ్ముతున్నట్టు పేర్కొన్నాడు. మరీముఖ్యంగా ఆటలు ఆడేటప్పుడు ఇది మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుందన్నాడు. ఓ గేమ్‌లో విజయం సాధించగానే మనం విజేతలం అయిపోమని పేర్కొన్నాడు. ఫీల్డ్‌ బయట మనం ఎలా ఉంటున్నామనేది కూడా మన ప్రయాణాన్ని చెబుతుందని రాహుల్ వివరించాడు.


ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్-ఇండియా కన్జ్యూమర్ మార్కెటింగ్ డైరెక్టర్ సుజల మార్టిస్ మాట్లాడుతూ.. మెన్‌ ఆఫ్‌ ప్లాటినంతో ఈ సీజన్‌ ప్రారంభించినందుకు సంతోషంగా ఉన్నట్టు చెప్పారు. టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌తో తమ అనుబంధం బలోపేతం చేసుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రచారం ద్వారా  మనందరికీ  క్రికెట్‌ ఫీల్డ్‌కు ఆవల స్ఫూర్తిని కలిగించే క్యారెక్టర్‌ను ప్రదర్శించే ప్రతిష్టాత్మక క్షణాలను వేడుక చేస్తున్నట్టు చెప్పారు.అవసరమైనప్పుడు ముందుండి నడిపించడమే నాయకత్వ లక్షణమని అన్నారు.


ఎన్నో సవాళ్లు, మరెన్నో ప్రతికూలతలు కలిగిన ఈ ప్రపంచంలో కొంతమంది తమకు ఎదురైన సంఘటనలను అతి తేలిగ్గా తీసుకుని ముందుకు సాగిపోతుంటారని ఫేమస్ ఇన్నోవేషన్స్ క్రియేటివ్ డైరెక్టర్ టెన్జిన్ వాంగ్డీ పేర్కొన్నారు. తమ చుట్టూ ప్రపంచం మారుతున్నా వీరు మాత్రం చలించరని, వారిది అలాంటి మనస్తత్వమని అన్నారు. ఈ ప్రచారంలో భాగంగా మెన్‌ ఆఫ్‌ ప్లాటినం పలు ప్రత్యేక కన్స్యూమర్‌ పోటీలు సైతం నిర్వహించనుంది. అదృష్టవంతులైన విజేతలు కేఎల్ రాహుల్‌ సంతకం చేసిన మ్యాన్‌ ఆఫ్‌ ద ప్లాటినం జెర్సీని గెలుచుకునే అవకాశం లభిస్తుంది. ఈ తాజా కలెక్షన్‌ భారతదేశంలో అన్ని ప్రధాన రిటైల్‌ స్టోర్లు వద్ద లభ్యమవుతాయి. 

Read more