లిటన్‌, ముష్ఫికర్‌ సెంచరీలు

ABN , First Publish Date - 2022-05-24T09:39:55+05:30 IST

లిటన్‌ దాస్‌ (135 బ్యాటింగ్‌), ముష్ఫికర్‌ రహీమ్‌ (115 బ్యాటింగ్‌) సెంచరీలతో కదం తొక్కడంతో శ్రీలంకతో సోమవారం ప్రారంభమైన రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ కోలుకుంది.

లిటన్‌, ముష్ఫికర్‌ సెంచరీలు

63 ఏళ్ల రికార్డు బద్దలు

బంగ్లాదేశ్‌ 277/5 

శ్రీలంకతో రెండో టెస్ట్‌

ఢాకా: లిటన్‌ దాస్‌ (135 బ్యాటింగ్‌), ముష్ఫికర్‌ రహీమ్‌ (115 బ్యాటింగ్‌) సెంచరీలతో కదం తొక్కడంతో శ్రీలంకతో సోమవారం ప్రారంభమైన రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ కోలుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆతిథ్య జట్టు 24/5తో తీవ్ర కష్టాల్లో పడింది. ఈ దశలో లిటన్‌, ముష్ఫికర్‌ ఆరో వికెట్‌కు అభేద్యంగా 253 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడంతో బంగ్లాదేశ్‌ 277/5తో నిలిచింది. కాగా.. 2013లో ముష్ఫికర్‌, అష్రఫుల్‌ ఆరో వికెట్‌కు నెలకొల్పిన 191 పరుగుల భాగస్వామ్యం బంగ్లాకు గత అత్యుత్తమం. 


1959 రికార్డు..:

ముష్ఫికర్‌, లిటన్‌ 63 ఏళ్ల వరల్డ్‌ రికార్డును బద్దలుగొట్టారు. గతంలో..25 పరుగులు అంతకంటే తక్కువ స్కోరుకు 5 వికెట్లు కోల్పోయి ఆరో వికెట్‌ అత్యధికంగా చేసినవి 86 పరుగులు. 1959లో పాక్‌కు చెందిన మథియాస్‌, షుజావుద్దీన్‌ ఆ రికార్డు చేశారు. 


కుశాల్‌కు ఛాతీనొప్పి:

మ్యాచ్‌ తొలి సెషన్‌ (23వ ఓవర్‌)లో..ఛాతీ నొప్పిగా ఉందని కుశాల్‌ మెండిస్‌ చెప్పడంతో ఈసీజీ పరీక్ష నిర్వహించారు. అయితే ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తేల్చారు.

Read more