LSGvsDC: ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ విజయం..

ABN , First Publish Date - 2022-05-02T01:10:59+05:30 IST

ముంబై : లక్నో సూపర్ జెయింట్స్ మరోసారి ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై మ్యాచ్ 6 పరుగుల తేడాతో మరో విజయాన్ని త

LSGvsDC: ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ విజయం..

 ముంబై : Lucknow Super Giants మరోసారి ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. Delhi Capitals పై 6 పరుగుల తేడాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ చివరి వరకు పోరాడినా భంగపాటు తప్పలేదు. ఆరంభంలోనే పృద్వీ షా, డేవిడ్ వార్నర్ రూపంలో రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మిచెల్ మార్ష్, కెప్టెన్ రిషత్ పంత్ చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ ఔటయ్యాక పావెల్, అక్సర్ పటేల్ మినహా ఎవరూ పెద్దగా రాణించకపోవడంలో ఢిల్లీకి మరో ఓటమి తప్పలేదు. చివరిలో అక్సర్ పటేల్ మ్యాచ్‌ను గెలిపించినట్టే కనిపించాడు.


ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో పృద్వీ షా 5 పరుగులు, డేవిడ్ వార్నర్ 3, మిచెల్ మార్ష్ 37, రిషబ్ పంత్ 44, లలిత్ యాదవ్ 3, పావెల్ 35, అక్సర్ పటేల్ 42(నాటౌట్), శార్దూల్ ఠాకూర్ 1, కుల్‌దీప్ 16(నాటౌట్) పరుగులు సాధించారు. లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్ 4 వికెట్లు తీయగా.. దుష్మంత చమీరా 1, రవి బిష్ణోయ్ 1, క్రిష్ణప్ప గౌతమ్ 1 చొప్పున వికెట్లు తీశారు. ఇక లక్నో బ్యాటింగ్‌లో డీకాక్ 23, కేఎల్ రాహుల్ 77, దీపక్ హుడా 52, స్టోయినిస్ 17, క్రునాల్ పాండ్యా 9 చొప్పున పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో థాకూర్ ఒక్కడే 3 వికెట్లు తీశాడు.

Updated Date - 2022-05-02T01:10:59+05:30 IST