IPL2022: కోల్‌కతాకు లక్నో చుక్కలు.. ఒక్క వికెట్ పడలేదు.. డికాక్ భారీ శతకం.. టార్గెట్ ఎంతో తెలుసా..

ABN , First Publish Date - 2022-05-19T02:47:23+05:30 IST

లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) ఓపెనర్లు క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు.

IPL2022: కోల్‌కతాకు లక్నో చుక్కలు.. ఒక్క వికెట్ పడలేదు.. డికాక్ భారీ శతకం.. టార్గెట్ ఎంతో తెలుసా..

ముంబై : లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) ఓపెనర్లు క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరోచిత ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లు ఆడి 210 పరుగులు సాధించారు. కోల్‌కతాకు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. క్వింటన్ డికాక్ ఈ సీజన్‌లోనే భారీ శతకాన్ని నమోదు చేశాడు. 59 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 70 బంతులు ఆడి 140 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి.  లక్నో జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఏమాత్రం తగ్గలేదు. మరోసారి తన బ్యాటింగ్ సత్తాను చాటుతూ 51 బంతులాడి 68 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.  ఇద్దరూ చివరి వరకు అజేయంగా నిలిచారు. దీంతో ఐపీఎల్ చరిత్రలో మొదటి వికెట్ అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా వీరిద్దరూ నిలిచారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లు ఎంత శ్రమించినా ఒక్క వికెట్ కూడా దక్కలేదు. టిమ్ సౌథీ, అండ్రూ రస్సెల్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, నితీష్ రాణాలను కూడా వదల్లేదు. ఇరువురూ తొలుత నెమ్మదిగా ఆడినా.. చివరి 5 ఓవర్లలో పరుగుల సునామీ సృష్టించారు. ముఖ్యంగా క్వింటన్ డికాక్ షాట్లకు కోల్‌కతా బౌలర్ల కళ్లప్పగించి చూడడం తప్ప ఏమీచేయలేకపోయారు.

Updated Date - 2022-05-19T02:47:23+05:30 IST