FIFA World Cup:ఇదే నా చివరి వరల్డ్ కప్...ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ సంచలన ప్రకటన

ABN , First Publish Date - 2022-10-07T14:02:18+05:30 IST

అర్జెంటీనా లెజెండ్, ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ(Lionel Messi) తన రిటైర్‌మెంట్ గురించి సంచలన ప్రకటన చేశారు....

FIFA World Cup:ఇదే నా చివరి వరల్డ్ కప్...ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ సంచలన ప్రకటన

న్యూఢిల్లీ: అర్జెంటీనా లెజెండ్, ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ(Lionel Messi) తన రిటైర్‌మెంట్ గురించి సంచలన ప్రకటన చేశారు. ఖతార్ 2022 తన చివరి ఫిఫా ప్రపంచ కప్ అని లియెనెల్ మెస్సీ వెల్లడించారు. ‘‘ఖతార్(Qatar) ప్రపంచ ఫుట్‌బాల్ పోటీలు నా చివరి కప్, నేను శారీరకంగా బాగానే ఉన్నా ఖచ్చితంగా ఇదే చివరి ప్రపంచ కప్’’ అని మెస్సీ చెప్పారు.అర్జెంటీనా లెజెండ్(Argentina legend) లియోనెల్ మెస్సీ తన చివరి ఫీపా ప్రపంచ కప్‌ 2022(FIFA World Cup) పోటీల్లో ఆడనున్నట్లు ఫార్వర్డ్ గురువారం ధృవీకరించింది.లియోనెల్ మెస్సీ 2006, 2010, 2014,2018 ప్రపంచ కప్‌లలో ఆడారు.


మెస్సీ రిటైర్‌మెంట్ ప్రకటనతో ఫుట్‌బాల్(foot ball) అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.‘‘నేను ప్రపంచకప్‌కు రోజులు లెక్కపెడుతున్నాను,ఈ పోటీల్లో ఏమి జరగబోతోందనేది ఆసక్తిగా మారింది’’ అని మెస్సీ పేర్కొన్నారు.మెస్సీ 2014 ప్రపంచ కప్‌ను గెలుచుకోవడానికి దగ్గరగా వచ్చాడు కానీ ఫైనల్‌లో జర్మనీ చేతిలో ఓడిపోయాడు.


Read more