లైంగిక దాడి కేసులో.. లామిచానె అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-10-07T09:03:58+05:30 IST

నేపాల్‌ స్టార్‌ క్రికెటర్‌ సందీప్‌ లామిచానెను గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు.

లైంగిక దాడి కేసులో.. లామిచానె అరెస్ట్‌

ఖాట్మండు: నేపాల్‌ స్టార్‌ క్రికెటర్‌ సందీప్‌ లామిచానెను గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. లామిచానె తనపై లైంగిక దాడి చేసినట్టు 17 ఏళ్ల బాలిక ఒకరు గత నెలలో ఆరోపించింది. ఆగస్టు 21న ఆ బాలికను ఖాట్మండులోని పలు ప్రాంతాలలో తిప్పి, అదేరోజు రాత్రి ఓ హోటల్‌లో ఆమెపై అత్యాచారం జరిపినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. లామిచానె 2018 ఐపీఎల్‌లో ఢిల్లీ తరపున ఆడాడు.

Updated Date - 2022-10-07T09:03:58+05:30 IST