ఇలాంటి బంతి నేనెప్పుడూ చూడలేదు: కేఎల్ రాహుల్
ABN , First Publish Date - 2022-04-11T23:57:39+05:30 IST
ముంబై : రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో తొలిబంతికే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

ముంబై : రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో తొలిబంతికే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ట్రెంట్ బౌల్డ్ తనకు రిప్పర్ బాల్ సంధించడం ఇదివరకెప్పుడూ చూడలేదన్నాడు. గతంలో ఇలాంటి బంతి ఎదుర్కొని ఉంటే ఏదో ఒకటి చేసేవాడినని, అందుకే వికెట్ సమర్పించుకోవాల్సి వచ్చిందన్నాడు. అదొక చక్కటి బంతి అని కొనియాడాడు. అద్భుతంగా బౌలింగ్ చేసిన ట్రెంట్ బౌల్ట్‌ను ప్రశంసించాడు. లక్నో సూపర్ జెయింట్స్ చక్కటి టీం అని, తిరిగి పుంజుకుంటామని మ్యాచ్ ప్రజెంటేషన్ సమయంలో ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్.. కేఎల్ రాహుల్‌కు తొలి బంతికే ఇన్-స్వింగర్ సంధించాడు. బంతి మిడిల్ వికెట్‌ను గిరాటేసింది. దీంతో క్లీన్ బౌల్డ్‌గా రాహుల్ వెనుదిరిగాడు. తొలి బంతికే వికెట్ పడడంతో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆరంభంలోనే పెద్ద ఎదురుదెబ్బతగిలినట్టయింది.
కాగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ గెలుపొందింది. 166 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన లక్నోకు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి బంతికే కెప్టెన్ కేఎల్ రాహుల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. కేవలం 3 పరుగుల తేడాతో రాజస్థాన్ గెలుపొందింది. దీంతో వరుసగా మూడు విజయాల తర్వాత లక్నో సూపర్ జెయింట్స్‌కు బ్రేక్ పడినట్టయింది.