మ్యాచ్‌ ఫిక్సింగ్‌ నేరం కాదు

ABN , First Publish Date - 2022-01-23T08:33:41+05:30 IST

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ నేరం కాదంటూ కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ నేరం కాదు

 కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు

బెంగళూరు: మ్యాచ్‌ ఫిక్సింగ్‌ నేరం కాదంటూ కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ప్రకారం ఫిక్సింగ్‌ శిక్షార్హం కూడా కాదని జస్టిస్‌ శ్రీనివాస్‌ హరీ్‌షకుమార్‌ నేతృత్వంలోని సింగిల్‌ జడ్జి బెంచ్‌ పేర్కొంది. 2019లో కర్ణాటక ప్రీమియర్‌ క్రికెట్‌ లీగ్‌ (కేపీఎల్‌)లో జరిగిన ఫిక్సింగ్‌ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన కోర్టు.. ఫిక్సింగ్‌కు సంబంధించి దోషులను శిక్షించడం సంబంధిత క్రీడా బోర్డు అంటే బీసీసీఐ పరిధిలోకి వస్తుందని తెలిపింది. నిందితులపై సెక్షన్‌ 420 కేసు నమోదం చేయడం సరికాదని, వీరిపై చీటింగ్‌ కేసు వర్తించదని వెల్లడించింది. 2019 కేపీఎల్‌ సందర్భంగా.. పలువురు ఆటగాళ్లు, జట్ల యజమానులు, కర్ణాటక క్రికెట్‌ సంఘం అధికారుల్లో కొందరు అవినీతికి పాల్పడ్డారంటూ అప్పట్లో బెంగళూరు పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 

Read more