టాప్‌-10లోకి జెమీమా

ABN , First Publish Date - 2022-10-05T09:21:19+05:30 IST

జెమీమా రోడ్రిగ్స్‌ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లింది. తాజా మహిళల టీ20 ర్యాంకింగ్స్‌ బ్యాటర్ల జాబితాలో జెమీమా ఏకంగా నాలుగుస్థానాలు మెరుగుపరచుకుంది.

టాప్‌-10లోకి జెమీమా

దుబాయ్‌: జెమీమా రోడ్రిగ్స్‌ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లింది. తాజా మహిళల టీ20 ర్యాంకింగ్స్‌ బ్యాటర్ల జాబితాలో జెమీమా ఏకంగా నాలుగుస్థానాలు మెరుగుపరచుకుంది. ఎనిమిదో ర్యాంకుతో టాప్‌-10లో నిలిచింది. స్మృతి మంధాన 3వ, షెఫాలీ వర్మ 7వ ర్యాంకుల్లో ఉన్నారు. హర్మన్‌ప్రీత్‌ 13వ ర్యాంకుకు చేరింది. ఆసీస్‌ స్టార్‌ బెత్‌ మూనీ టాప్‌ ర్యాంకులో కొనసాగుతోంది. బౌలర్లలో దీప్తిశర్మ 6వ ర్యాంకులో ఉండగా, ఇంగ్లండ్‌ స్టార్‌ సోఫీ ఎకిల్‌స్టోన్‌ నెంబర్‌వన్‌ స్థానాన్ని నిలబెట్టుకుంది.  

Read more