జైస్వాల్‌ డబుల్‌ సెంచరీ

ABN , First Publish Date - 2022-09-24T09:28:14+05:30 IST

యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్‌ డబుల్‌ సెంచరీ (209 నాటౌట్‌)తో కదం తొక్కాడు. కేవలం రెండున్నర సెషన్లలోనే ఈ ఓపెనర్‌ ద్విశతకం బాదడంతో

జైస్వాల్‌ డబుల్‌ సెంచరీ

వెస్ట్‌జోన్‌ 376/3

సౌత్‌జోన్‌తో దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌


కోయంబత్తూర్‌: యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్‌ డబుల్‌ సెంచరీ (209 నాటౌట్‌)తో కదం తొక్కాడు. కేవలం రెండున్నర సెషన్లలోనే ఈ ఓపెనర్‌ ద్విశతకం బాదడంతో సౌత్‌జోన్‌తో జరుగుతున్న దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో వెస్ట్‌జోన్‌ పట్టు బిగించింది. శుక్రవారం ఆట ముగిసే సరికి వెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లకు 376 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఆ జట్టు 319 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ 318/7 స్కోరుతో మూడోరోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన సౌత్‌జోన్‌ 327 పరుగులకు ఆలౌటైంది. వెస్ట్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 270 పరుగులే చేయడంతో.. సౌత్‌కు 57 పరుగులు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. 


సంక్షిప్తస్కోర్లు: వెస్ట్‌జోన్‌: 270, 376/3 (జైస్వాల్‌ బ్యాటింగ్‌ 209, శ్రేయాస్‌ 71); 

సౌత్‌జోన్‌ తొలి ఇన్నింగ్స్‌: 327 (ఇంద్రజీత్‌ 118, మనీశ్‌ పాండే 48, గౌతమ్‌ 43, ఉనాద్కట్‌ 4/52, అటిట్‌ షేత్‌ 3/51, గజా 2/33). 

Read more